Thursday, January 23, 2025

వ్యవసాయ, మధ్య తరగతి రంగాలకు ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -
  • వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసిన అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త

మేడ్చల్: జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో ప్రధానంగా వ్యవసాయ రంగంతో పాటు చిన్న తరహా, మధ్య తరగతి రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్తా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశం నిర్వహించారు. బ్యాంకర్ల జిల్లా స్థాయి సమన్వయ సమీక్ష సమావేశానికి అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్తా అధ్యక్షత వహించారు. 2

023/2024 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూ.18,370 కోట్లతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. గత సంవత్సరం రూ.16,373 కోట్లతో జిల్లా రుణ ప్రణాళికను రూపొందించగా ఈ ఏడు మరింత ఎక్కువగా పెంచారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్తా మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి బ్యాంకు తమకంటూ ఒక లక్షాన్ని నిర్ధేశించుకొని అందుకు అనుగుణంగా రుణాలు అందజేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల మంజూరీలో ఏఏ బ్యాంకులు ఎంత వరకు రుణాలు మంజూరు చేశారు. గ్రౌండింగ్‌కు సంబంధించిన వివరాలను బ్యాంకుల అధికారులను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు రుణ సదుపాయం అందించేలా ఆయా శాఖల జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు.

జిల్లాలో నిర్ధేశించిన లక్షాన్ని వంద శాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఐ.శ్రీనివాసులు, ఆర్‌బిఐ ఎల్‌డిఓ తేజ్ దీపిత బెహరా, నాబార్డ్ డిడి ఓ.సురభి, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు వినోద్, బాలాజీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేరీరేఖ, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News