Sunday, December 22, 2024

అగ్రికల్చర్ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల

- Advertisement -
- Advertisement -

Agriculture EAMCET primary key release

రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అగ్రికలర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల జులై 30,31 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదలైంది. www.eamcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌లో ‘కీ’తో పాటు రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. ప్రాథమిక కీ పై ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అభ్యంతరాలు సమర్పించవచ్చని పేర్కొన్నారు.

వారంలో ఫలితాలు

రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాలు వారంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రాథమిక కీ ని విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించగా, తాజాగా అగ్రికల్చర్ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల చేశారు. అగ్రికల్చర్ ఎంసెట్ తుది కీ ఖరారు చేసిన వెంటనే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News