Wednesday, January 22, 2025

బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

పంటల బీమా యోచనలో రాష్ట్ర ప్రభుత్వం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రకృతి వైపరీత్యాలు, ఇతర వ్యాధుల వల్ల పంట నష్టపోయే రైతులకు ’పంటల బీమా’ ఇవ్వడంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. అలాగే ఈ ఖరీఫ్ సీజన్ నుంచి పంటలకు ప్రభుత్వం బోనస్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఆదివారం తాజ్ డెక్కన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గ్లోబల్ రైస్ సమ్మిట్ బ్రోచర్‌ను మంత్రి తుమ్మల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పంటలకు గిట్టుబాటు ధర అందించే విధముగా తమ ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటుందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు తగ్గ విధానాలు రూపొందించాల్సిన అవసరముందన్నారు. వరి ఎగుమతులు నిషేధిoచడంలో, అవి ధరల పై తీవ్ర ప్రభావం చూపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థానంలో తెలంగాణ ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేదం విధించిందని.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.దేశానికి అన్నం పెట్టే రైతులకు మేలు చేసేలా కేంద్రం ఆలోచించాలని సూచించారు. దేశంలో రేషన్ బియ్యాన్ని ఎవరూ పెద్దగా వాడట్లేదన్నారు. ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని భారత్ రైస్ పేరిట ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇచ్చే భారత్ రైస్ స్కీమ్‌లో సన్న బియ్యం ఇస్తే సంతోషమన్నారు.కేంద్ర ప్రబుత్వం తీసుకువచ్చిన్న భారత రైస్ పథకoలో పంపిణీ చేసే బియ్యం ఆ రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా లేకపోతే, ఆ పథకం పూర్తిగా నిరర్దకం అవుతుందని తెలియజేసారు. అదే విధముగా పంటల సాగులో కూడా వైవిద్యానిక తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉందని పంట మార్పిడి రైతులకు అధిక ఆదాయం వచ్చే పంటల సాగుకు ప్రోత్సహిస్తూ, సమతుల్యత పాటిస్తుందని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ,అంతర్జాతీయ నిత్యావసరాల సంస్థ భారత దేశ సలహాదారు ప్రొఫెసర్ అల్దా జానయ్య, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకులు లక్ష్మీబాయి, విత్తన అభివృద్ధి సంస్థ సంచాలకులు కేశవులు , పలు సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News