నల్లగొండ:మోడి అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో పడిందని, పంటల సాగు విషయంలో ము ందస్తు ప్రణాళిక చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ కమిటీ సభ్యులు, మాజీ ఎ మ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. బుధవారం మిర్యాలగూడస్థానిక సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో పంటలసాగు చేసుకునేందుకు అ నేక వనరులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కేంద్ర ప్ర భుత్వం విఫలమైందన్నారు.
41 కోట్ల సాగుభూమి ఉన్నప్పటికీ కేవలం 30 కోట్ల పంటలను మాత్రమే సాగు చేస్తున్నారని చె ప్పారు. తక్కువ సాగుభూమి ఉన్న అమెరికా, చైనాలాంటి దేశాలు పంటలను సాగు చేస్తున్నారని చెప్పారు. పంటలను సాగు చేసుకోవడంలో ప్రభుత్వం సరైన ప్రణాళిక రూపొందించ డం లేదని విమర్శించారు. దాని ఫలితంగా ఏటా 13 వేలమంది రైతులు చనిపోతున్నారని, వాపోయారు. ప్రతి సీజన్లో ముందుగానే వ్యవసాయ అధికారులతో భూముల నాణ్యతలను పరిశీలించి, వాటికనుగుణంగా పంటను సాగు చేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు.
ప్రస్తుత వానాకాలం సీజన్లో పంటలు సాగు చేసుకునేందుకు రైతులను ప్రోత్సహించాలని కోరారు. మార్కెట్లో వచ్చే కల్తీ విత్తనాలు, ఎరువులను అరికట్టాలని డిమాండ్ చేసారు. ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడం సరైంది కాదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాకనే వ్యవసాయం సంక్షోభంలో పడిందని ధ్వజమెత్తారు. వ్యవసాయా న్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో కొత్త చట్టాలు తీసుకొస్తున్నారని, రైతులు అప్రమత్తంగా ఉండి, వాటిని తిప్పి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.