Sunday, December 22, 2024

వ్యవసాయానికి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేసిందని రిజిస్ట్రార్ డా.వెంకట రమణ అన్నారు. శుక్రవారం తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ఘనంగా జరిగింది. తొలుత ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. వెంకటరమణ నివాళులర్పించారు. తరువాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఎందరో త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పాటైందని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రోజురోజుకీ అభివృద్ధి పధాన సాగుతుందన్నారు. అవసరాలకి అనుగుణంగా కొత్త కళాశాలలు, పరిశోధనా స్థానాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల సౌకర్యాలు పెద్ద ఎత్తున కల్పిస్తూ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పై గురతుర బాధ్యత ఉందని, అందరూ ఆ దిశగా కృషి చేయాలని రిజిస్ట్రార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News