Saturday, December 21, 2024

జూలై 8, 9 వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జులై 8,9 తేదీలలో మఖ్ధూం భవన్, హిమాయత్ నగర్, హైదరాబాదులో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. బాల మల్లేష్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలు జూలై 8 తేదీన ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి.

సమావేశానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి నిర్మల్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కూనంనేని సాంబశివరావు, బి కే ఎం యు జాతీయ కార్యవర్గ సభ్యులు టి వెంకట్ రాములు హాజరవుతారు. రాష్ట్ర సమావేశాలలో బికేఎంయు జాతీయ మహాసభలు పాట్నా, సభ్యత్వం, పేదల ఇళ్ల స్థలాలు, పోడు భూముల సమస్య తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర సమితి సభ్యులు సకాలంలో హాజరుకావాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News