Thursday, January 23, 2025

కిసాన్ క్రెడిట్ కార్డుకు కేంద్రం మంగళం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రకృతి ఆటుపోట్లకు ఎదురొడ్డి ఆరుగాలం శ్రమకోర్చి పంట లు పండిస్తూ దేశ ప్రజల ఆహారభద్రతకు భరోసానిస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మొండి చెయ్యి ఎదురవుతోంది. వ్యవసాయరంగంలో రైతులను వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన ప్రధాని నరేంద్రమోడీ సర్కారు వ్యవసాయ పథకాల్లో కోతలు పెడుతూ రైతుల వెన్ను విరుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సన్న, చిన్న కారు రైతులకు వరప్రదాయనిగా ఉ న్న కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో ఏటేటా కోతలు విధిస్తూ మోడీ సర్కారు ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తుండటమే ఇందుకు ఉదాహరణ గా చూపుతున్నారు. ఈ పథకాన్ని క్రమేపి ఎత్తివేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఈ పథకం లక్ష్యాలను ఎం డుగడుతూ వస్తోందంటున్నారు. సొంత పొలం ఉండి ఎలాంటి పూచికత్తు లేకుండా వ్యవసాయరంగంలో రైతులు బ్యాంకుల ద్వారా తక్కు వ వడ్డీలతో రుణాలు పొంది తమ పంటలసా గు అవసరాలు తీర్చుకునే ఈ బృహత్తర పథకాన్ని 1988లో అప్పటి కేంద్ర ప్రభుత్వం, రి జర్వ్ బాంక్, నాబార్డు సంయుక్తంగా ప్రవేశపెట్టాయి.

పంటల పెట్టుబడికోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల పాలిటబడి నష్టపోకుండా సన్న, చిన్న కారు రైతులను ఆదుకోవడానికి దీనిని ప్రవేశపెట్టారు. వ్యవసాయరంగంలో 18నుంచి70ఏళ్లవరకూ ఉన్న ప్రతిరైతుకూ ఈ పథకానికి అర్హత కల్పించారు. పొలానికి సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్కు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్కు ప్రతులతో ఏ బ్యాంకులోనైనా దరఖాస్తు చేసి కిసాన్‌క్రెడిట్ కార్డులు పొందే అవకాశం కల్పించారు. ప్రభుత్వరంగ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా 5సంవత్సరాలు చెల్లుబాటు కాలపరిమితితో ఈ కార్డు లు ఇచ్చారు. కాలపరిమితి ముగిశాక మళ్లీ రెన్యూవల్ చేసుకునే అవకాశం ఉంది. ఈ కార్డు ఉన్న ప్రతిరైతు ఎటువంటి పూచి కత్తులేకుండా తనకు ఎప్పుడు అవరసం ఉన్నా రూపొయినుంచి 3లక్షల రూపాయల వరకూ 9శాతం వడ్డీతో రుణం పొందవచ్చు. 2.5ఎకరాల వరకూ ఉన్న రైతుకు రూ.2 లక్షలు, అంతకన్న ఎక్కువ భూమి ఉన్న రైతుకు రూ.3లక్షల వరకూ బ్యాంకు రుణాలు పొందే అవకాశం కల్పించారు.

కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులకు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజి కూడా కల్పించారు. కిసాన్ కార్డు పథకంలో చేరిన వారికి రూపే క్రెడిట్ కార్డు లభిస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రీమియం చెల్లిస్తే పంటల బీమా కూడా లభిస్తుంది. పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు సదుపాయం కూడా లభిస్తుంది. కార్డు ఉన్న ప్రతిరైతుకూ రూ.25000 వరకూ క్రిడిట్ లిమిట్‌తో చెక్‌బుక్ కూడా లభిస్తుంది. బ్యాంకు రుణంగా ఇచ్చే మొత్తంపై 9శాతం వడ్డీలో కేంద్ర ప్రభుత్వం 2శాతం రాయితీ కూడా ఇస్తుంది. ఇక రైతు 7శాతమే చెల్లించాల్సివుంది. అది కూడ గడువు లోపు సకాలంలో చెల్లిస్తే మరో 3శాతం రాయితీ లభిస్తుంది.
రైతుకు ఆర్థిక అండపై మోడీ ప్రభుత్వం బండ!
కిసాన్ క్రెడిట్ కార్డు పథకం సన్న చిన్నకారు రైతులకు ఆర్థికంగా అండనిస్తుండగా, ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దుచేసి రైతుల నెత్తిన బండ వేసేందుకు సిద్దమవుంతోందని రైతులు ,రైతుసంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుంతున్నాయి. కిసాన్ కార్డుల పథకాన్ని కేంద్రమే ఒక పథకం ప్రకారం నీరుగారుస్తోంది. ఏటా లక్షల మంది రైతులను ఈ పథకం నుంచి తప్పిస్తోంది. 2019నాటికి దేశవ్యాప్తంగా 1.08కోట్ల మంది రైతులకు కిసాన్ కార్డులు మంజూరు చేయగా, గత ఏడాది కేవలం 74.78లక్షల మందికి మాత్రమే కిసాన్ కార్డులు మంజూరయ్యాయి. ఒక్క ఏడాదిలోనే కేంద్ర ప్రభుత్వం 34లక్షల మంది సన్న చిన్నకారు రైతుల చేతినుంచి కిసాన్ కార్డులు ఊడబెరికింది.దేశంలో 14కోట్ల మంది రైతులుండగా కేవలం 74.78లక్షల మంది రైతులకే కిసాన్ కార్డుల పథకాన్ని పరిమితం చేసింది. మిగిలిన రైతులందరినీ ప్రధాని మోడి ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు పొందే అవకాశం లేకుండా చేసింది.
వడ్డీవ్యాపారుల నోటికి 13 కోట్ల రైతులను అప్పగించిన కేంద్రం
కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని నీరుగారుస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో అత్యధికశాతం రైతులను పంటల సాగు పెట్టుబడులకోసం అధిక వడ్డీల దిశగా పరోక్ష ప్రోత్సాహాన్నిస్తోంది. దేశంలో 13కోట్లమందికి పైగా రైతులను మోడి సర్కారు ప్రవైటు వడ్డీవ్యాపారుల నోటికి ఆహారంగా వేస్తోందన్న విమర్శలు పుట్టుకొస్తున్నయి. కిసాన్ క్రెడిట్ కార్డు పథకానికి కేవలం మొక్కబడిగా మార్చి ప్రతియేటా దేశంలో 0.5శాతం మంది రైతులతో మమ అనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News