Wednesday, January 22, 2025

ఆధునిక పరిశ్రమగా వ్యవసాయం వర్ధిల్లాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయం ఆధునిక పరిశ్రమగా వర్ధిల్లాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. సాంప్రదాయ వ్యవసాయం నుండి రైతాంగం బయటకు రావాలి పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని కన్హ శాంతివనంలో సమున్నతి సంస్థ నిర్వహించిన లైట్ హౌస్ కాంక్లేవ్ ఎఫ్‌పివో 2023 కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రపంచానికి ఆహారం అందించేది మనమే అన్నారు. మనది వ్యవసాయిక దేశం అని వెల్లడించారు.తెలంగాణలో రైతు ఉత్పత్తి సంఘాలకు ప్రోత్సాహం ఇస్తున్నట్టు తెలిపారు.

భవిష్యత్ మీద గొప్ప ఆశతో విద్యాధికులైన వ్యవసాయ నిపుణులు వ్యవసాయం మీద ప్రేమతో చేయడం, చేయిస్తుండడం సంతోషదాయకం అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల సంఖ్య మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉన్నది వెల్లడించారు.సమున్నతి సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 180 కిపైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం అభినందనీయం అన్నారు. రైతు ఉత్పత్తిదారుల విజయగాధలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, రైతులు ఉత్పత్తి చేసే వ్యవసాయ పంటలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ చేయడం, రైతులకు లాభదాయకంగా మార్చడం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంపై సుధీర్ఘమైన చర్చ చేయడం ఆశించదగిన పరిణామం అని పేర్కొన్నారు.సామూహిక ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలతో పెట్టుబడి తగ్గి రైతుకు లాభం జరుగుతుందని వారు చెబుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సమున్నతి సంస్థ సీఈఓ అనిల్ కుమార్, డైరెక్టర్ ప్రవేశ్ శర్మ, డాక్టర్ వెంకటేష్ తగత్, ఏపీఎంఏఎస్ సీఈఓ సీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News