Monday, January 20, 2025

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి

- Advertisement -
- Advertisement -

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సంఘం ప్రతినిధుల వినతి

మన తెలంగాణ/హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం స్పందించి డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావాలని పిసిసి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు ఎ.రేవంత్‌రెడ్డికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్.బాలమల్లేష్, ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నల్లబోలు సునీత ప్రతినిధులు కలిసి మెమోరాండం సమర్పించారు. సమస్య పరిష్కారానికి రేవంత్ హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ప్రభుత్వం వేలం వేసి అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే డబ్బు చెల్లించి వారిని ఆదుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్.బాలమల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అగ్రిగోల్డ్ కంపెనీ 1995లో ప్రారంభించబడిరదని, అగ్రిగోల్డ్ కంపెనీలలో డిపాజిట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి డిపాజిటర్ల పేర్లతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో దాదాపు 5 వేల కోట్ల రూపాయల వరకు వసూలు చేసి, కొన్ని కంపెనీలను ప్రారంభించారని బాలమల్లేష్ అన్నారు. ఆ డబ్బులతో స్థలాలు, రీసార్ట్‌లు నిర్మించారని, 2015 సంవత్సరంలో డిపాజిట్‌దారులకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం చేతులెత్తేసిందని వారు పేర్కొన్నారు. యజమన్యాన్ని అరెస్టు చేసి ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నారు తప్పా, డిపాజిట్‌దారులు దాచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వలేదని, దీంతో డిపాజిట్‌దారులు నష్టపోయారని, కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, మరికొంతమంది డిపాజిట్‌దారులు వారు చేర్పించిన ఏజెంట్ల ఇండ్లపై భౌతికంగా దాడులు చేశారని వారు తెలిపారు. డిపాజిట్‌దారుల ఒత్తిడితో ప్రభుత్వాలు అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తు చేసి బాధితులను ఆదుకుంటామని ప్రకటించాయని, కాని ఆచరణలో ఒక ఆంధ్రప్రదేశ్ తప్పా ఎక్కడా డిపాజిట్‌దారులకు డబ్బులు చెల్లించలేదని ఎన్.బాలమల్లేష్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News