మునుగోడు: రైతులు చట్టాలపై అవగాహన, న్యాయ సహా యం పొందడానికి దేశంలో తొలిసారిగా అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు ప్రారంభించినట్లు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,జిల్లా జడ్జి దీప్తి అన్నారు. మ ంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన అవగాహన సదస్సు కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు ఉద్దేశించి మాట్లాడుతూ దుక్కి దున్నిన నాటినుండి పండించిన పంట మార్కెట్‌లో అమ్మేదాకా రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. నాణ్యతలేని విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల వల్ల నష్టాలు,మార్కెట్‌లో మోసాలు , పంటల భీమా, అతివృషి అనావృష్టి వంటి సందర్భాలలో రైతు చట్టాలు ఎంతో అవసరపడతాయని పేర్కొన్నారు. రైతులకు మేలు చేసే చట్టాలు ఎన్నో ఉన్నా సరైన అవగాహన లేక రైతులు నష్టపోతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు.
రైతులకు ప్రతి విషయంలో న్యాయ చట్టాల ద్వారా ప్రయోజనం చేకూర్చేందుకు అగ్రిలీగల్ క్లీనిక్‌లు దోహదపడతాయని అన్నారు. వ్యవసాయ విధానాలు వైవిధ్యాన్ని , ఆధునీకరణను సంతరించుకున్న తరుణంలో రైతులకు చట్టబద్దంగా అందవలసిన ఫలాలు అందేవిదంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉం దన్నారు. ప్రతి మండల కేంద్రంలోని రైతువేదికలో పారాలీగల్ వాలంటీర్లు అ ందుబాటులో ఉంటారని, వ్యవసాయ చట్టాలు, రైతు సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు రైతుల హక్కులు, బాధ్యతలు చట్టపరమైన పరిష్కారాల గురించి తెలియజేస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నేలపట్ల నరేష్,మండల వ్యవసాయ అధికారి సూదగాని శ్రీనివాస్‌గౌడ్, వ్యవసాయ విస్తరణ అధికారి మాదగోని నరసింహగౌడ్, పారాలీగల్ వాలంటీర్లు పగడాల నాయగ్య, కోడి రాములు , పగడాల జంగమ్మ, గుర్రాల యా దమ్మ, వివిద గ్రామాల రైతులు ,తదితరులు పాల్గొన్నారు.