హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్ల్యే తిప్పన విజయ సింహారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డిలు హాజరయ్యారు. ఆదివారం ఉదయం ఆగ్రోస్ కార్యాలయంలో మంత్రుల సమక్షంలో ఆగ్రోస్ సిఎండి కె. రాములు చైర్మన్ విజయ సింహారెడ్డి చేత బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఫైల్ పై సంతకం చేయించారు. అనంతరం మంత్రులు విజయ సింహారెడ్డికి శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
స్వయంగా రైతు బిడ్డ అయిన విజయ సింహారెడ్డి అగ్రోస్ చైర్మన్‌గా రైతులకు నిరంతరం సేవలు అందిస్తారన్నారు. రైతులకు సేవలు చేయడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు తిప్పన విజయ సింహారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు దగ్గరుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపి బడుగుల లింగయ్యయాదవ్, తదితరులు పాల్గొన్నారు.