Sunday, December 22, 2024

వాపోయిన ఇరాన్ మాజీ అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

టెహ్రాన్: ఇజ్రాయెల్ నిఘా కోసం ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ అధిపతే చివరికి తమను మోసం చేశాడని ఇరాన్ మాజీ అధ్యక్షుడు ముహమ్మద్ అహ్మదీజాద్ వాపోయారు. తమ సమాచారం ఇజ్రాయెల్ కు చేరేవేసేవాడని  సిఎన్ఎన్ తుర్క్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ కు చెందిన మొస్సాద్ తమ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ను తమ వైపుకు తిప్పుకుందన్నారు. ఇటీవల కాలంలో మొస్సాద్ కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయన్నారు. మొస్సాద్ ఓ ఆపరేషన్ ద్వారా లక్ష అణుపత్రాలను అపహరించింది. వాటిని ఇజ్రాయెల్ ప్రధాని 2018లో బహిర్గతం కూడా చేశారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News