ఐపిఎల్‌లో రెండు కొత్త జట్లు
ఫ్రాంచైజీని దక్కించుకున్న అహ్మదాబాద్, లక్నో
వచ్చే సీజన్‌లో పది జట్లతో టోర్నీ
బిసిసిఐపై కనక వర్షం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో మరో రెండు కొత్త జట్లు చేరాయి. వచ్చే సీజన్‌లో మొత్తం పది జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుతం ఐపిఎల్‌లో 8 ఫ్రాంచైజీలు ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా నిర్వహించిన బిడ్ల ద్వారా భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) రెండు కొత్ల ఫ్రాంచైజీలకు చోటు కల్పించింది. అహ్మదాబాద్, లక్నో జట్లు ఐపిఎల్‌లో కొత్తగా చోటు దక్కించుకున్నాయి. అహ్మదాబాద్ జట్టును సివిపి క్పాపిటల్స్ పార్ట్‌నర్స్ దక్కించుకుంది. ఇక లక్నో టీమ్‌ను ఆర్‌పిఎస్‌సి గ్రూప్ సొంతం చేసుకుంది. ఇక అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం సిసివి క్యాపిటల్స్ 5,600 కోట్ల రూపాయలను వెచ్చించింది.ఇక లక్నో టీమ్ కసో ఆర్‌పిఎస్‌జి గ్రూప్ ఏకంగా 7090 కోట్ల రూపాయలను చెల్లించింది. రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం బిసిసిఐ ఇటీవల బిడ్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇక చివరికి అత్యధిక మొత్తం చెల్లించిన సంస్థలకు కొత్త ఫ్రాంచైజీలను బిసిసిఐ అప్పగించింది. బిసిసిఐ ఆహ్వానించిన బిడ్‌లకు అనూహ్యస్పందన లభించింది. ఏకంగా 22 కంపెనీలు ఈ బిడ్ కోసం టెండర్లు వేశాయి. ఇందులో కోసం ప్రతి కంపెనీ రూ.పది లక్షలు విలువ చేసే టెండర్ పేపర్స్‌ని కొనుగోలుచేశాయి. కానీ బిసిసిఐ ఒక్కో ఫ్రాంచైజీ కనీస ధరను ఏకంగా రూ.2000 కోట్లుగా నిర్ణయించింది. దీంతో తీరా బిడ్‌లు వేసే సమయానికి చాలా కంపెనీలు వెనుకంజ వేశాయి. ఇక బిడ్ దాఖలు చేసిన సంస్థల్లోఅదాని గ్రూప్, కొటర్, టొరెంట్ ఫార్మా తదితర కంపెనీలు ఉన్నాయి. అయితే చివరికి సిపిసి క్యాపిటల్ పార్ట్‌నర్స్‌తో పాటు గొయెంకా గ్రూప్‌నకు చెందిన ఆర్‌పిఎస్‌జి సంస్థలు కొత్త ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి.
ఇక పది జట్ల సమరం..
వచ్చే ఏడాది నుంచి ఐపిఎల్‌లో మొత్తం పది జట్లు పోటీపడనున్నాయి. ప్రస్తుతం ఐపిఎల్‌లో 8 ఫ్రాంచైజీలే ఉన్నాయి. తాజాగా అహ్మదాబాద్, లక్నోలు చేరడంతో ఐపిఎల్‌లో మొత్తం జట్ల సంఖ్య పదికి చేరింది. ప్రస్తుతం డిఫెండింగ్ చాపియన్ చెన్నై సూపర్ కింగ్స్, మాజీ విజేతలు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి. తాజా మరో రెండు ఫ్రాంచైజీలు కొత్తగా చేరాయి. దీంతో వచ్చే సీజన్‌లో మరిన్ని మ్యాచ్‌లను చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది. ఇక కొత్త జట్ల రాకతో వచ్చే సీజన్ కోసం ఆటగాళ్లకు మహా వేలం పాట నిర్వహించనున్నారు. దీంతో స్టార్ క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు పది ఫ్రాంచైజీలు పోటీ పడడం ఖాయం. ఇదే జరిగితే ఆటగాళ్లపై కనక వర్షం కురవడం ఖాయం.
Ahmedabad and lucknow 2 new IPL teams Announced