Monday, January 20, 2025

కేజ్రీవాల్‌కు అహ్మదాబాద్ కోర్టు మరోసారి నోటీస్‌లు జారీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు , రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌కు అహ్మదాబాద్ కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. ఇద్దరూ జూన్ 7న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రధాని నరేంద్రమోడీ అకడమిక్ డిగ్రీపై గుజరాత్ యూనివర్శిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. ఇద్దరినీ మంగళవారం కోర్టుకు హాజరు కావాలని గతంలో సమన్లు జారీ చేయగా, కోర్టుకు ఎవరూ హాజరు కాలేదు.

అయితే సమన్లు అందినట్టు కనిపించడం లేదని కోర్టుకు తెలపడంతో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఇద్దరు నేతలకు నోటీసులు జారీ చేసింది. అయితే కోర్టు సమన్లు ఇంకా తమకు అందలేదని గుజరాత్ లీగల్ సెల్ హెడ్ ప్రణవ్ ఠక్కర్ తెలిపారు. నేతలిద్దరూ గుజరాత్ వర్శిటీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, యూనివర్శిటీ పరువు , ప్రతిష్ఠలకు భంగం కలిగించారని వర్శిటీ రిజిస్ట్రార్ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News