- Advertisement -
పుణే: అహ్మద్‌నగర్ హాస్పిటల్ లో నవంబర్ 6న అగ్ని ప్రమాదం జరగడంతో అందులో చికిత్స పొందుతున్న 11 మంది కోవిడ్ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోయారు. వారంతా సీనియర్ సిటిజన్లే. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జిల్లా సివిల్ సర్జన్ సునీల్ పోఖర్నా, ఇద్దరు వైద్యాధికారులు సురేశ్ దాఖే, విశాఖ షిండే, స్టాఫ్ నర్స్ సప్నా పథారేలను సస్పెండ్ చేసింది. కాగా ఇద్దరు స్టాఫ్ నర్సులు ఆస్మా షేఖ్, చనా అనంత్ సర్సీలను టర్మినేట్ చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే సోమవారం ట్వీట్ చేశారు. కాగా అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలపై ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోంది.
- Advertisement -