Wednesday, January 22, 2025

అహో! విక్రమార్క ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆ కర్షణీయమైన నటనతో దేవ్ గిల్ అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా దేవ్ గిల్ ప్రొడక్షన్స్‌పై రూపొందుతోన్న పాన్ ఇండి యా చిత్రం ‘అహో! విక్రమార్క’. ఈనెల 30న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా దేవ్ గిల్ మాట్లాడుతూ “అ హో! విక్రమార్క సినిమాతో మహారాష్ట్ర పో లీసుల ధైర్యాన్ని, అంకితభావాన్ని ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News