Tuesday, December 24, 2024

అహుజో యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Ahujo app was launched by Minister Srinivas Goud

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తమ క్యాంపు కార్యాలయంలో అహుజో ఆల్ ఇన్ వన్ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మొట్టమొదటిసారి ఇండియాలో హైదరాబాద్ నుంచి విదేశీ సంస్థలకు ధీటుగా అన్ని సర్వీసులు ఓకే యాప్‌లో ఉండేలా రూపొందించడం గొప్ప విషయన్నారు. ఈ యాప్‌లో మనకు కావాల్సిన ఫుడ్, గ్రోసరీ, క్యాబ్, ఆటో, బైక్ ట్రాక్, ఎలక్ట్రిషన్ ఏసి రిపేర్, ప్లంబర్ ఇలాంటి అన్ని సర్వీసులను హోం డెలివరీ సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇన్ వన్ యాప్ తయారుచేసిన అహుజో డైరెక్టర్లు డి.తిరుపతి రావు, ఎం. కిషోర్, అహుజో టీం మెంబెర్స్ మహేష్, లారెన్స్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News