Tuesday, January 21, 2025

త్వరలో ఎఐ ఇంజనీరింగ్ 1000 మంది రిక్రూట్‌మెంట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రభుత్వ సంస్థ ఎఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ త్వరలో 1000 మంది కొత్తవారిని రిక్రూట్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ సంస్థ తన నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాలింగ్ సామర్థ్యాన్ని పెంచాలని చూస్తోంది. కంపెనీ ప్రతిపాదిత రిక్రూట్‌మెంట్‌కు ముందు కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 5,000గా ఉంది. రిక్రూట్‌మెంట్ తర్వాత వారి సంఖ్య దాదాపు 6,000 వరకు పెరగనుంది. ఎఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఐఇఎస్‌ఎల్) గత 3 సంవత్సరాలలో సగటు వార్షిక ఆదాయాన్ని సుమారు రూ. 2000 కోట్లు ఇచ్చింది. కంపెనీ తన సామర్థ్యాన్ని విస్తరించేందుకు నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు చేపట్టింది. అదే సమయంలో ఈ కంపెనీని డిజిన్వెస్ట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News