- Advertisement -
చెన్నై: 2026లో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిఎంకె-కాంగ్రెస్ కూటములకు వ్యతిరేకంగా.. బిజెపి-అన్నాడిఎంకె కలిసి కూటమిగా ఏర్పడనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖరారు చేశారు. ‘అన్నాడిఎంకె అంతర్గత వ్యవహారంలో మేం జోక్యం చేసుకోము.. మాకు పొత్తు కోసం ఎలాంటి షరతులు విధించలేదు. వచ్చే ఎన్నికల్లో మా కూటమి ఘన విజయం సాధించడం ఖాయం’ అని అమిత్ షా అన్నారు. అంతేకాక.. వచ్చే ఎన్నికల్లో తమిళనాడు సిఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును అమిత్‌షా ప్రకటించారు.
- Advertisement -