Friday, December 20, 2024

16 మంది అభ్యర్థులతో అన్నాడిఎంకె తొలి జాబితా

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అన్నాడీఎంకె బుధవారం ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పొడి కె. పళనిస్వామి ఈ జాబితాను పార్టీ నేతల సమక్షంలో విడుదల చేశారు. జాబితా విడుదల సమయంలో డీఎండీకేతో పొత్తును పళనిస్వామి ప్రకటించారు. పొత్తులో భాగంగా డీఎండీకే 5 స్థానాల్లో పోటీ చేయనుండగా, పుదియ తమిళగం , ఎస్‌డీపీఐలు చెరో స్థానంలో పోటీ చేయనున్నాయి. ఈ సందర్భంగా పళనిస్వామి మాట్లాడుతూ తాము (అన్నాడీఎంకే ) బలంగా ఉన్నామని నమ్ముతున్నామని, ప్రజల మద్దతు తమకే ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. సోషల్ మీడియాలో ఎవరు ఏమనుకుంటున్నారో తాము పట్టించుకోమని, ప్రజలతోనే తమ అలయెన్స్ అని చెప్పారు.

అన్నాడీఎంకే తొలి జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. చెన్నై సౌత్ నుంచి కె. జయవర్ధన, చెన్నై నార్త్ నుంచి రాయపురం మనోహర్, కాంచీపురం నుంచి ఇ. రాజశేఖర్,అరక్కోణం నుంచి ఏఎల్ విజయన్, క్రిష్ణగిరి నుంచి వి. జయప్రకాష్, అరని నుంచి జీవీ గజేంద్రన్, విల్లుపురం నుంచి జె. భాగ్యరాజ్ , సేలం నుంచి పి. విఘ్నేష్, నమక్కల్ నుంచి ఎస్. తమిళ్‌మణి, ఈరోడ్ నుంచి అశోక్ కుమార్, కరూర్ నుంచి కేఆర్ ఎల్ తంగవేల్, చిదంబరం నుంచి ఎం. చంద్రహాసన్, మధురై నుంచి పి. శరవణన్, థేని నుంచి వీటీ నారాయణస్వామి, విరుధునగర్ నుంచి పి. జయపెరుమాళ్, నాగపట్నం నుంచి జి. సూర్జిత్ శంకర్ పోటీ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News