Monday, December 23, 2024

పన్నీర్ సెల్వం స్థానాన్ని ఉదయ్‌కుమార్‌తో భర్తీ చేసిన అన్నాడిఎంకె

- Advertisement -
- Advertisement -

AIADMK replaced Panneerselvam with Uday Kumar

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని పార్టీ నుంచి బహిష్కరించడంతో ఖాళీ అయిన అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానంలో మాజీ మంత్రి ఆర్‌బీ ఉదయ్‌కుమార్‌ను అన్నాడీఎంకె నియమించింది. పార్టీ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి తెలిపారు. ఉదయ్‌కుమార్ తిరుమంగళం నియోజక వర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ సెక్రటరీగా అగ్రి ఎస్‌ఎస్ కృష్ణమూర్తిని ఎన్నుకున్నారు. పన్నీర్ సెల్వాన్ని ఈనెల 11న పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News