Thursday, January 23, 2025

పళనిస్వామికి తాళాలు అప్పగించాలి: కోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఎఐఎడిఎంకెలోని రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ చెలరేగడంతో రెవెన్కూ అధికార యంత్రాంగం ఎఐఎడిఎంకె ప్రధాన కార్యాలయానికి జులై 11న ఆర్‌డిఒ ఉత్తర్వుపై అధికారులు పది రోజుల క్రితం సీల్ వేసి మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీ ప్రధాన కార్యాలయం సీలును తొలగించాలని, కార్యాలయం తాళాన్ని మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి అప్పగించాలని మద్రాస్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఇప్పుడు ఆ కార్యాలయం సీలును పదిరోజుల తరువాత గురువారం తొలగించి పార్టీ కార్యాలయాన్ని తెరిచారు. ఎఐఎడిఎంకెలోని కె.పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరగడంతో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశంపై జులై 11న అధికారులు ఆ పార్టీ ప్రధాన కార్యాలయానికి సీలు చేశారు. సీలు తొలగించాలని ఈపీఎస్, ఓపీఎస్ వేర్వేరుగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. దాంతో ఆర్‌డిఒ ఉత్తర్వును కోర్టు రద్దు చేయడంతో రెవెన్యూ అధికారులు పోలీస్‌ల సమక్షంలో సీలును తొలగించారు. అవ్వాయి షన్ముగం స్లై ప్రాంతంలో ఉన్న ఈ ఆఫీసుకు నిత్యం తగిన రక్షణ కల్పించాలని, నెల రోజుల పాటు పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆఫీస్ లోకి ప్రవేశించనీయ రాదని కూడా రాయిపేట పోలీసులను హైకోర్టు జడ్జి ఆదేశించారు.

AIADMK Office key hands over to Palaniswamy: Madras HC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News