Monday, December 23, 2024

ఎఐఎడిఎంకె నుంచి పన్నీర్‌సెల్వం సోదరుడు బహిష్కరణ..

- Advertisement -
- Advertisement -

AIADMK Removes Panneerselvam's brother Raja From Party

చెన్నై: ఎఐఎడిఎంకె టాప్ లీడర్ పన్నీర్‌ సెల్వంకు సోదరుడైన ఒ. రాజా ఇటీవల వికె శశికళను కలిసి పార్టీ విషయాలు చర్చించినందుకుగాను అతడిని పార్టీ నుంచి శనివారం బహిష్కరించారు. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేసినందుకుగాను రాజాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు ఎఐఎడిఎంకె కోఆర్డినేటర్ పన్నీర్‌సెల్వం, కో-కోఆర్డినేటర్ కె. పళనిస్వామి సంయుక్త ప్రకటనలో తెలిపారు. వారు తీసుకున్న క్రమశిక్షణ చర్యలో మరో ముగ్గురు కార్యకర్తలు కూడా ఉన్నారు. ఎఐఎడిఎంకె నాయకురాలు జె.జయలలితకు నమ్మినబంటు అయిన శశికళ కొన్నేళ్ల క్రితమే పార్టీకి దూరమయ్యారు. ఆమె ఇటీవల రెండు రోజుల పర్యటనపై దక్షిణ తమిళనాడుకు వచ్చారు. మార్చి 4న ఆమె తన మద్దతుదారులను కలుసుకున్నారు. తిరుచందూర్‌లో అప్పుడు ఆమెను రాజా కలుసుకుని పార్టీకి సంబంధించిన విషయాలను చర్చించారు.

AIADMK Removes Panneerselvam’s brother Raja From Party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News