- Advertisement -
తేల్చిచెప్పిన అన్నాడిఎంకె
కృష్ణగిరి : వికె శశికళను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి రానిచ్చేది లేదని అన్నాడిఎంకె నేతలు సోమవారం తేల్చిచెప్పారు. శశికళ ఇప్పుడు పార్టీలో గందరగోళం చిచ్చు రేపేందుకు యత్నిస్తున్నారని, అందుకే ఆమె పార్టీ బలోపేతం అంటూ ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీకి ఆమె ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని అన్నాడిఎంకె సీనియర్ నేత కెపి మునుసామి స్పష్టం చేశారు. పార్టీకి ఆమెను రానిచ్చే ప్రసక్తే లేనప్పుడు ఇక పార్టీపై ఆమె పట్టుబిగించే సమస్యే ఉత్పన్నం కాదని సామి స్పష్టం చేశారు.
- Advertisement -