Saturday, April 19, 2025

అసెంబ్లీ నుంచి అన్నాడిఎంకె వాకౌట్

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడు లోని ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడిఎంకె వరుసగా రెండోరోజుకూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ఆ పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి అధికారంలో ఉన్న డీఎంకే పై మండిపడ్డారు. అధికార పార్టీ ఊసరవెల్లిగా మారిందని విమర్శించారు. బుధవారం అసెంబ్లీలో వివాదాస్పద మంత్రులైన కె. పొన్ముడి, కెఎన్ నెహ్రూ, వీ సెంథిల్ బాలాజీలపై అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు అన్నాడీఎంకే సభ్యులు ప్రయత్నించారు.

అయితే స్పీకర్ ఎం. అప్పావు నిరాకరించారు. దీంతో నిరసనగా అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే అధినేత ఎడప్పొడి కె పళనిస్వామి డీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం అణచివేస్తున్నదని విమర్శించారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను కాపాడుతున్నారని ఆరోపించారు. సీఎం స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారని పళనిస్వామి ప్రశ్నించారు. వారి ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనం. రాజకీయ సౌలభ్యం కోసం రంగులు మార్చే ఊసరవెల్లిగా డీఎంకే మారిందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News