Monday, December 23, 2024

కొత్త కూటమి బాటలోనే అన్నాడిఎంకె

- Advertisement -
- Advertisement -

చెన్నై : కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు అన్నాడిఎంకె పార్టీ వర్గాలు తెలిపాయి. తమిళనాడులో అన్నాడిఎంకె ఇటీవలే బిజెపితో మిత్రత్వాన్ని తెంచేసుకుంది. ఎన్‌డిఎకు దూరం అవుతున్నట్లు తీర్మానించింది. బిజెపితో నిమిత్తం లేకుండా తమ పార్టీ కొత్త కూటమి ఏర్పాటుతో వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కె అన్నామళైని పదవి నుంచి తొలిగించాలని తాము ఎప్పుడు చెప్పలేదని అన్నాడిఎంకె సీనియర్ నేత కెపి మునుసామి విలేకరులకు తెలిపారు.

వేరే పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి తొలిగింపును తమ పార్టీ ఎందుకు కోరుకుంటుందని, ఈ విధంగా తమ అన్నాడిఎంకె వంటి పెద్ద పార్టీ చేస్తుందని అనుకోవడం పిల్లచేష్ట అన్పించుకుంటుందన్నారు. ఇతర పార్టీలు ఏ విధంగా నడుచుకోవాలనేది చెప్పేంతటి అనాగరిక పార్టీ తమది కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల నాటికి అన్నాడిఎంకె తిరిగి ఎన్‌డిఎ గూటికి చేరుతుందనే స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ , మరో కూటమిని ఏర్పాటు చేసే తాము తిరిగి ఆ కూటమిలో ఎందుకు చేరుతామని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News