Wednesday, April 2, 2025

కాచిగూడ చేరుకున్న ఎఐసిిసి ఇంచార్జీ మీనాక్షి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ నూతన ఎఐసిసి ఇంచార్జీగా ఎన్నికైన మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చారు. శనివారం ఉదయం ఆమె హైదరాబాద్‌లో కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. మీనాక్షికి టిపిసిసి అధ్యక్షుడు ఎంఎల్‌సి మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట ప్రోటోకాల్ చైర్మన్ హర్కర్ వేణుగోపాల్, ఫహీం, రచమల్ల సిద్దేశ్వర్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. గాంధీ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎఐసిసి కార్యదర్శులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News