Monday, December 23, 2024

రక్షణ బలగాల్లోని అనాథలకు సాయం రూ.3వేలకు పెంపు

- Advertisement -
- Advertisement -

Aid to defense force orphans increased to Rs.3 thousand

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాల్లో పనిచేస్తూ ప్రాణాలర్పించిన కుటుంబాల పిల్లలకు ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సైనికుల అనాథ పిల్లలకు నెలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 3వేలకు పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు వీరికి నెలకు రూ. 1,000 చెప్పున ఇస్తున్నారు. రక్షణ దళాల్లో సేవలందించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అనాథ పిల్లలు(కుమార్తె, కుమారుడు)21 సంవత్సరాల లోపు ఉండాలి. వారికి వివాహం కాకపోతే వారు ఈ పథకానికి అర్హులు అవుతారు. ఇక, కేంద్రీయ సైనిక్ బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని మాజీ సైనికుల అనాథ పిల్లలకు అందిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News