- Advertisement -
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) సస్పెన్షన్ విధించింది. ఎఐఎఫ్‌ఎఫ్‌ను తక్షణమే సస్పెండ్ చేస్టున్నట్టు ఫిఫా మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఫిఫా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత ఫుట్‌బాల్‌లో తృతీయ పక్షం జోక్యం పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫిఫా వెల్లడించింది. భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్ తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తోందని, ఈ విషయంలో ఎన్ని సార్లు హెచ్చరించినా ఫలితం లేకుండా పోయిందని ఫిఫా పేర్కొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఎఐఎఫ్‌ఎఫ్‌పై వేటు వేయాల్సి వచ్చిందని ఫిఫా కౌన్సల్ స్పష్టం చేసింది. ఫిఫా నిర్ణయంతో భారత్ వేదికగా జరగాల్సిన మహిళల అండర్17 ప్రపంచకప్ ప్రశ్నార్థకంగా మారింది.
AIFF Suspends to Indian Football Team
- Advertisement -