Friday, December 27, 2024

ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులు

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్యే కూనంనేనికి ఎఐవైఎఫ్ రాష్ట్ర సమితి అభినందనలు 
హైదరాబాద్: ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడేది కమ్యూనిస్ట్ లు మాత్రమేనని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగాకూనంనేని సాంబశివరావు విజయం పట్ల ఎఐవైఎఫ్ రాష్ట్ర సమితి హర్షం వ్యక్తం చేసింది. బుధవారం హిమాయత్ నగర్ లో మాక్ధూమ్ భవన్ లోని రాజ్ బహదూర్ హాల్ లో కూనంనేని కి ఎఐవైఎఫ్ నేతలు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, ఏరాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు నెర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ కూనంనేని గెలుపు పార్టీకి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. ప్రజా సమస్యల పట్ల అపార అనుభవం, గతంలో ఎమ్మెల్యేగా చిరస్మరణీయ సేవలు అందించారని, మళ్ళీ గెలుపుతో అసెంబ్లీలో సిపిఐ వాణిని వినిపించనున్నారని తెలిపారు. కార్మిక, కర్షక, ఉద్యోగ, విద్యార్థి, నిరుద్యోగ యువత, మహిళ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తి పరిష్కారం చూపిస్తారన్నారు.

ఎన్నో ఆశలు పెట్టుకొని నిరుద్యోగులు యువత విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని వారి సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ యుగంధర్, మహేందర్, కార్యవర్గ సభ్యులు ఆర్. బాలకృష్ణ, షేక్ మహమూద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News