Wednesday, January 22, 2025

ఎయిమ్స్ నిర్ణయం మార్పు

- Advertisement -
- Advertisement -

రేపు వైద్య సేవలు కొనసాగింపు
మధ్యాహ్నం 2.30 గంటల లోపూ ఒపిడి సేవలు ఉంటాయి
నేడు అయోధ్య రామ్ మందిర్‌లో ప్రాణ ప్రతిష్ఠ

న్యూఢిల్లీ : ఢిల్లీలోని అఖిల భారత్ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సోమవారం తెరిచే ఉంటుంది. అయోధ్య రామ్ మందిర్‌లో ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం సందర్భగా సోమవారం మధ్యాహ్నం 2.30 వరకు ఔట్‌పేషెంట్ విభాగం (ఒపిడి) సేవలు నిలిపివేయాలని సంస్థ ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాన్ని ఆదివారం మార్చుకుంది. ‘శనివారం (20) నాటి ఆఫీస్ మెమోరాండం కొనసాగింపుగా రోగులకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు, రోగులకు వైద్య సేవలు అందేందుకు ఒపిడి సేవలతో సహా అన్ని క్లినికల్ సేవలు కొనసాగనున్నాయి’ అని ఎయిమ్స్ ఆదివారం తాజా ప్రకటనలో తెలియజేసింది. ఢిల్లీలోని లేడీ హార్డింగ్ వైద్య కళాశాల కూడా సోమవారం రోజు అంతా ఒపిడి, ఎమర్జన్సీతో సహా అన్ని సేవలు మామూలుగా అందుతాయని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News