Monday, November 25, 2024

బ్లాక్‌ ఫంగస్.. కొత్త మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఓవైపు విలయం సృష్టిస్తుంటే మరో వైపు బ్లాక్ ఫంగస్ తన కోరలు చాస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలోనూ ఈ ఫంగస్ లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే బ్లాక్‌ ఫంగస్ (మ్యూకోర్‌మైకోసిస్) కారణంగా 90 మంది మరణించగా.. రాజస్థాన్‌లో 100 కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) బ్లాక్ ఫంగస్ ఉనికిని గుర్తించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఎవరికి రిస్కు ఎక్కువ …
మధుమేహం అదుపులో లేనివారు, బాగా స్టెరాయిడ్స్ తీసుకునే వారు
రోగ నిరోధక మందులు, యాంటీ క్యాన్సర్ చికిత్స తీసుకునేవారు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు,
కరోనా తీవ్రమై ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్టుతో ఉండి, కోలుకున్న వారికి, బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
బ్లాక్ ఫంగస్‌ను ఎలా గుర్తించాలి?
ముక్కు నుంచి రక్తం కారడం లేదా బ్లాక్ డిశ్చార్జి కావడం
ముక్కు దిబ్బడ, తలనొప్పి, కళ్ల చుట్టూ చర్మం ఉబ్బడం, కళ్లు ఎర్రబారడం, ఒక వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం, కంటి చూపు కోల్పోతున్నట్టు అనిపించడం, కళ్లు తెరవడం, మూయడంలో తీవ్రమైన ఇబ్బంది, ముక్కు తిమిరిగా అనిపించడం, స్పర్శ కోల్పోతున్నట్టు అనుభూతి కలగడం, ఆహారం నమలడంలో ఇబ్బంది, నోరు తెరవ లేక పోవడం,
దంతాలు వదులు కావడం, నోటి లోపలి భాగం ఉబ్బడం
ఏం చేయాలి?
పై లక్షణాలు కనిపించితే వెంటనే ఇఎన్‌టి డాక్టరును, లేదా కంటి డాక్టరును సంప్రదించాలి.రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోవాలి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవాలి. డాక్టరును సంప్రదించకుండా స్టెరాయిడ్స్, యాంటీ ఫంగల్ మందులు వాడరాదు. డాక్టర్ల సూచనపైనే పారానాసిల్, సైనస్ టెస్టులు చేయించుకోవాలి. ఇదిలా ఉండగా ఈ బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధుల చట్టం (1897) ప్రకారం నోటిఫైబుల్ డిసీజ్‌గా ప్రకటించాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం కోరింది.

AIIMS Released New Guidelines for Black Fungus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News