Sunday, January 19, 2025

మిత్రుడికి ఆర్థిక సహాయం అందజేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: తమతోపాటు కలిసి చదువుకున్న మిత్రుడు అనారోగ్యంతో భాదపడుతున్న విషయాన్ని తెలుసుకుని తోటి మిత్రులు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించి నీకు మేమున్నామన్న భరోసా కల్పించారు. మోత్కూరు మండలంలోని అనాజిపురం గ్రామానికి చెందిన ఐల నర్సయ్య అనారోగ్యంతో భాదపడుతున్నాడు విషయం తెలుసుకున్న 1991 -92 బ్యాచ్ విద్యార్దులు మిత్రులు సోమవారం నర్సయ్యను కలిసి రూ.50వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామీణ కబడ్డీ క్రీడాకారునిగా జిల్లా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మిత్రుడు ఐల నర్సయ్య త్వరగా కోలుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్దుల సంఘం ప్రతినిధులు అభినయ శ్రీనివాస్, బత్తిని రామకృష్ణ, గూడ గణేష్, ఆవుల వెంకటేశ్వర్లు, ముత్తినేని తిరుమలేష్, గుండగోని రామచంద్రు, నోముల వెంకన్న, గనగాని నర్సింహ్మ, చల్లా వెంకట్‌రెడ్డి, గుజ్జ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News