Thursday, January 23, 2025

యూత్, ఫ్యామిలీ మెచ్చే చిత్రాలు చేయడమే లక్ష్యం…

- Advertisement -
- Advertisement -

సెవెన్ హిల్స్‌ ప్రొడక్షన్ బ్యానర్‌పై బిగ్‌బాస్‌ సీజన్ 7 తెలుగు ఫేమ్ గౌతమ్‌ కృష్ణ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. శ్వేతా అవాస్తి, రమ్య పసుపులేటి నాయికలు. పి.నవీన్ కుమార్‌ దర్శకుడు. సతీష్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈయన గతంలో “బట్టల రామస్వామి బయోపిక్కు” అనే చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలతోపాటు చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. తదుపరి ఆర్‌.పి. పట్నాయక్‌ తో “కాఫీ విత్ ఏ కిల్లర్” చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఆయన నిర్మిస్తున్న మూడో చిత్రమిది. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి.  నిర్మాత సెవెన్ హిల్స్  సతీష్‌ కుమార్‌  పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయన  మాట్లాడుతూ “గతంలో నేను నిర్మించిన రెండు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. “ఆకాశవీధుల్లో” చిత్రంతో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్ 7 షోతో మరింత పాపులర్‌ అయిన గౌతమ్‌ కృష్ణతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అతనికి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఈ కథకు పర్ఫెక్ట్‌గా యాప్ట్‌ అయ్యాడు. గౌతమ్‌ బిగ్‌బాస్‌ షో నుండి తిరిగి రాగానే చివరి షెడ్యూల్‌ పూర్తిచేస్తాం.

ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి స్టూడెంట్‌ నుంచి కార్పోరేట్‌ స్థాయికి ఎలా ఎదిగాడు అన్న ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రమిది. ఫ్యామిలీ మరియు యూత్ కి బాగా కనెక్ట్‌ అవుతుంది. త్వరలో ఫస్ట్‌లుక్ మరియు టీజర్‌ను విడుదల చేస్తాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం. యువత, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలతో చిత్రాలు తీయాలన్నదే నా  లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని చెప్పారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్‌.కె మామ, ఆనంద్‌ చక్రపాణి, భద్రం, పింగ్‌పాంగ్‌ సూర్య, ల్యాబ్‌ శరత్ తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News