Saturday, November 16, 2024

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్షం

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ : పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని , ప్రభుత్వ ఆసుపత్రులల్లో అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతూ ఇబ్బంది తలెత్తకుండా చూస్తోందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో బుధవారం ఫాకో మిషన్‌ను ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర వైద్యరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ నుండి సమావేశాన్ని ఏర్పాటు చేసి పది జిల్లాల్లో మిషన్‌లను ప్రారంభించారు. వైద్యరోగ్య శాఖలో అమలు చేస్తున్నా నూతన కంటి ఆపరేషన్‌ల నిమిత్తం అందుబాటులోకి తెచ్చిన ఫాకో మిషన్‌ను ప్రారంభించారు. పరికరం పని తీరును డాక్టర్ ఇద్రిస్ అక్బాని ఎమ్మెల్యేకు వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ అధునాత పరికరాలతో వైద్య సేవలందించడానికి గానూ ఫాకో మిషన్‌ను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. కంటికి సంబంధించిన ఆపరేషన్‌లు ఇక పై సులభతరం కానున్నాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య అందించాలన్న లక్షంతో వైద్యరోగ్యంలో ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ , సూపరిండెంట్ డాక్టర్ ఆశోక్, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆర్‌ఎంఓ తొడసం చందు, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News