Friday, December 20, 2024

17 స్థానాల్లో గెలుపే లక్ష్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి ఢిల్లీ వేదికగా వీరం తా గురువారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మం త్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ ఎం ఎల్‌సి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మం త్రులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని వారు తె లిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పార్లమెంట్ కో-ఆర్డినేటర్ల మీటింగ్ జరిగిందని వారు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం పై ఖర్గే దిశానిర్దేశం చేశారని వారు వెల్లడించారు. 17 స్థానాలకు 17 స్థానాలను గెలవడమే లక్ష్యం గా పెట్టుకున్నామని వారు తెలిపారు. రెండు, మూడు స్థానాల కోసం బిఆర్‌ఎస్, బిజెపిల మధ్య పోటీ ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
నల్లగొండలో 3 లక్షల మెజార్టీ
నల్లగొండలో 3 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని వారు జోస్యం చెప్పారు. కేంద్రం, రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి ఉంటేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని వారు అన్నారు. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లా లో ఎఐసిసి అగ్రనాయకులు సూచించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా కలిసికట్టుగా పని చేశారో పార్లమెంట్‌లో కూడా అదే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారని వారు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాలను క లుపుకొని ముందుకెళ్లాలని ఎఐసిసి సూచించిదన్నారు. మెజార్టీ సీట్లలో గెలవాలని, దక్షిణ తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుచుకోవాల్సిన బాధ్యత కోఆర్డినేటర్‌లదేనని ఖర్గే చెప్పారని వారు పేర్కొన్నారు.

పార్టీలో ఉన్న వివిధ స్థాయి నేతలు చేయాల్సిన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారని వారు పేర్కొన్నారు. ప్రచా రం ఎలా ఉండాలి, పోల్ మేనేజ్‌మెంట్, ప్రజలతో మమేకం అవ్వడంపై ఖర్గే మార్గనిర్ధేశం చేశారని వారు తెలిపారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని భావిస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు అవకాశం ఉంటుందని వారు చెప్పారు. ఢిల్లీ వేదికగా కాం గ్రెస్ హైకమాండ్ గురువారం ఈ కీలక సమావేశం నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై తెలంగాణ సమన్వయకర్తలతో పార్టీ అగ్ర నేతలైన ఖర్గే, రాహుల్, కెసి వేణుగోపాల్ ఈ సమావేశం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, దామోదర రాజనర్సింహాలు గైర్హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ సైతం రెండు పార్లమెంటు స్థానాలకు ఇన్‌చార్జిగా ఉన్నందున ఆయన కూడా ఢిల్లీకి హాజరుకావాల్సి ఉన్నా చివరి నిమిషంలో ఆయన ఢిల్లీ టూర్ రద్దయ్యింది.
17 ఎంపి స్థానాలకు కో ఆర్డినేటర్‌ల నియామకం
లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు కో-ఆర్డినేటర్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టేలా వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. 17 స్థానాలకు 17 స్థానాలను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా పనిని ప్రారంభించింది.
సోనియా మా కోరిక మన్నిస్తారనే అనుకుంటున్నాం : భట్టి
ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన పార్లమెంట్ కో ఆర్డినేటర్ల సమావేశంలో తె లంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు. ఆ సమావేశం తర్వాత న్యూఢిల్లీలో భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం చేయాల్సిన భవిష్యత్తు కార్యక్రమాల వ్యూహ రచనపై గురువారం సమావేశంలో అధిష్ఠానం దిశా నిర్దేశం చేశారని భట్టి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవడానికి వ్యూహ రచన, ప్రణాళికలు చేయడానికి కావలసిన సూచనలు అధిష్టానం చేసిందన్నారు.

అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని అత్యధిక స్థానాల్లో విజయం సాధించడానికి పని చేస్తామని చెప్పారు. “తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించి అధికారం ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్లో గెలిపిస్తారు. దేశ సంపద వనరులు దేశానికి ఉండాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహు ల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రజల ఆస్తులు ప్రజలకే, దేశానికి ఉండాలి. దేశానికి సంబంధించిన ఆస్తులు దేశానికి ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజల ఆస్తులు దేశ వనరులను కొద్ది మంది పారిశ్రామికవేత్తలకు అమ్మకానికి పెట్టి దారాదత్తం చేసే రాజకీయ పార్టీలకు ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. లోక్ సభ ఎన్నికల్లో ఇదే తీర్పు వస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ అంటే రాష్ట్ర ప్రజలకు అపరిమితమైన ప్రేమ, గౌరవం ఉంది. స్వరాష్ట్రం కావాలనే దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను నిజం చేసిన సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి ఏకగ్రీవంగా తీర్మానం చేసి అభ్యర్థించాం. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కోరికను సోనియా గాంధీ మన్నిస్తారని ఆశిస్తున్నాం” అని భట్టి విక్రమార్క అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News