Wednesday, January 22, 2025

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ

- Advertisement -
- Advertisement -

ఔరంగాబాద్ మాజీ లోక్‌సభ సభ్యుడు ఇంతియాజ్ జలీల్ రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ సోమవారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరఫున పార్టీ ఎమ్మెల్యేలు ముఫ్తీ ఇస్మాయిల్, షా ఫరూఖ్ అన్వర్‌తోపాటు ఫరూఖ్ షాబ్దీ, రయీస్ లష్కరియా పేర్లను విలేకరుల సమావేశంలో ఆయన ప్రకటించారు. ఇస్మాయిల్ మాలెగావ్ సెంట్రల్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా అఅన్వర్ ధూలే నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అష్కరియా పార్టీ ముంబై నగర అధ్యక్షుడిగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో శివసేన అభ్యర్థి సందీపన్ భూమ్రే చేతిలో ఓటమిపాలైన జలీల్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని ఒవైసీ వెల్లడించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News