- Advertisement -
ముంబై : ఎంఐఎంతో మహారాష్ట్రలో అధికార కూటమి ఎంవిఎ (మహా వికాస్ అగాధి) పొత్తు కుదుర్చుకునే ప్రతిపాదనపై శివసేన ఎంపి (రాజ్యసభ) సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంవీఎ కూటమి లోకి ఎంఐఎంను రానివ్వబోమని స్పష్టం చేశారు. ఔరంగజేబు సమాధి ముందు మోకరిల్లే ఎంఎం ఎట్టి పరిస్థితుల్లోను మహారాష్ట్ర ఆదర్శాలకు స్ఫూర్తి కాదని, బీజేపీకి అది బి టీమ్‌గా ఉంటోందని వ్యాఖ్యానించారు. బీజేపీతో ఎంఐఎంకు రహస్య పొత్తు ఉందని ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రుజువైందని చెప్పారు. మూడు పార్టీల పొత్తుతో ఏర్పడిన ఎంవిఎలో నాలుగో పార్టీ భాగస్వామ్యానికి చోటు లేదని వ్యాఖ్యానించారు. ఎంవిఎ భాగస్వామ్య పార్టీలు ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శంభాజీ ఆశయాలను గౌరవిస్తుండగా, ఎఐఎంఐఎం ఔరంగజేబు ముందు మోకరిల్లుతుందని విమర్శించారు.
- Advertisement -