Tuesday, January 21, 2025

భావసారూప్య పార్టీగా ఎఐఎంఐఎం నిరూపించుకోవాలి

- Advertisement -
- Advertisement -

AIMIM must prove it is a like-minded party:NCP chief Jayant Patil

మహా ఎన్‌సిపి చీఫ్ జయంత్ పాటిల్

ముంబై :ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అనేక మంది సమాజ్‌వాదీ అభ్యర్థులు ఓడిపోడానికి, తద్వారా బిజెపి విజయం సాధించడానికి ఎఐఎంఐఎం బాధ్యురాలని , అందుకని ఆ పార్టీ తన చేతల ద్వారా వాస్తవమైన ఆకాంక్షలను నిరూపించుకోవాలని, మహారాష్ట్ర ఎన్‌సిపి చీఫ్ జయంత్ పాటిల్ శనివారం వ్యాఖ్యానించారు. తమ పార్టీ సహచరుడు, ఆరోగ్యమంత్రి రాజేష్ టోపే తనకు అత్యంత సన్నిహితుని మరణం సందర్భంగా సంతాపం తెలియచేసే సమయంలో ఎఐఎంఐఎం ఔరంగాబాద్ ఎంపి ఇమితాజ్ జలీల్‌ను కలిశారు తప్ప ఇందులో రాజకీయాలేవీ చర్చించ లేదని ఆయన అన్నారు. ఎంవిఎ ఎంఎల్‌ఎలు బడ్జెట్ సమావేశాలను బహిష్కరించే ప్రశ్నే లేదన్నారు. బిజెపి ఎంఎల్‌ఎలు కూడా అభివృద్ధి పనులకు నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంపై ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News