- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కెఎస్ బదౌరియా బుధవారం భేటీ అయ్యారు. కోవిడ్ -19 సంబంధిత పరిస్థితుల్లో సహాయపడటానికి భారత వైమానిక దళం (ఐఎఎఫ్) తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రధానికి వివరించారు. దేశంలో ఆక్సిజన్ కొరత, కంటైనర్ల తరలింపుపై ప్రధాని మోడీ సమీక్షించారు. విదేశాల నుంచి కరోనా పరికరాల తరలింపుపై ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియాతో చర్చించారు. దేశీయంగా ఆక్సిజన్ కంటైనర్ల తరలింపు, సహాయ చర్యలకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రధానికి వివరించారు. దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టడంలో 24 గంటలు పనిచేసేందుకు వైమానిక దళ సిబ్బంది అప్రమత్తం చేశామని బదౌరియా ప్రధాని మోడీ తెలిపారు. పిఎంవో కార్యాలయ అధికారులు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
Air Chief Marshal Bhadauria meets Prime Minister Modi
- Advertisement -