Saturday, November 23, 2024

గాలి వడపోతతో కరోనాకు చెక్

- Advertisement -
- Advertisement -
Air Filters Can Remove Airborne Coronavirus
ఆస్పత్రుల్లో ఈ యంత్రాలను అమర్చుకోవాలని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తల సూచన

లండన్ : గాలి వడపోత ద్వారా ఆస్పత్రుల్లోని కొవిడ్ వార్డుల్లో వైరస్ వ్యాప్తిని సమర్ధంగా అడ్డుకోవచ్చని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సూచించారు. ఈమేరకు వారు ఇటీవల పరిశోధన సాగించారు. అనేక ఆస్పత్రుల కొవిడ్ వార్డుల్లో వాయు నమూనాలను సేకరించి వాటిలో కరోనా వైరస్ స్థాయిలను నమోదు చేశారు. తరువాత ఆయా చోట్లు హైఎఫిషియన్సీ పార్టిక్యులేట్ ఎయిర్ (హెచ్‌ఇపిఎ) మెషిన్లను, యూవి స్టెరిలైజర్లను అమర్చారు. గాలి లోని అత్యంత సూక్ష్మస్థాయి కణాలను సైతం సమర్ధంగా అడ్డుకునే ఈ యంత్రాలను ఏడు రోజుల పాటు నిరాటంకంగా వినియోగించారు.

ఆ సమయంలో మళ్లీ అక్కడి గాలిని పరీక్షించగా, కరోనా జాడ కనిపించలేదు. దీంతో యంత్రాలను నిలిపివేసి మళ్లీ వాయు నమూనాలను పరీక్షించగా, వైరస్‌తో కూడిన ఏరోసోల్స్ ఉన్నట్టు తేలింది. వాయుశుద్ధి యంత్రాలు బ్యాక్టీరియా, వైరస్ ఫంగస్‌లతో కూడిన గాలితుంపర్లను గణనీయంగా తగ్గిస్తున్నాయి. గాలి పరిశుభ్రంగా ఉన్న చోట వాయుమార్గంలో వ్యాధులు సంక్రమించే ముప్పు చాలా తక్కువే. అలాగని వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి ఎయిర్ ఫిల్టర్లు మాత్రమే సరిపోవు. మాస్కులు ధరించడం, దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటివి పాటించాలి. వైద్య సిబ్బంది అయితే పిపిఈ కిట్లు ధరించడం వంటి జాగ్రత్తలు కూడా పాటించాలని పరిశోధనకర్త ప్రొఫెసర్ స్టీఫెన్ బేకర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News