- Advertisement -
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోడానికి సైన్యం, వైద్యబృందాలు ఆదివారం రంగం లోకి దిగాయి. నాలుగు ఆర్మీ కాలమ్స్,రెండు వైద్య బృందాలు అక్కడికి వెళ్లాయి. ఒక్కో ఆర్మీకాలమ్‌లో 30 నుంచి 40 మందివరకు సైనికులు ఉంటారు. జోషిమథ్ లోని రింగీ గ్రామంలో ఆర్మీ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్సు కూడా సహాయ కార్యక్రమాలను చేపట్టింది. ఎన్‌డిఆర్‌ఎఫ్ (జాతీయ విపత్తు పునరావాస దళం)కు చెందిన అధికారులను వరద ప్రాంతానికి చేరవేయడానికి సి 130,ఎఎన్ 32 విమాన సర్వీసులను ఇండియన్ ఎయిర్‌ఫోర్సు నిర్వహిస్తోందని అధికారులు చెప్పారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మిలిటరీ హెలికాఫ్టర్ సర్వీసులను వినియోగిస్తోంది.
Air Force Army Help With Uttarakhand Rescue
- Advertisement -