Sunday, December 22, 2024

సిబ్బంది లాంగ్ సిక్‌లీవ్… 80 విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది నిర్వాకంతో80 కి పైగా విమానాలు రద్దయ్యాయి. క్యాబిన్ సిబ్బంది అకస్మాత్తుగా సిక్‌లీవ్ పెట్టడంతో విమానాలను రద్దు చేసినట్టు ఎయిరిండియా బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి తమ సిబ్బందిలో కొందరు అస్వస్థతకు గురైయ్యారని తెలిపింది. దీంతో విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయని, 80 కి పైగా విమానాలను రద్దు చేశామని తెలియజేసింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారికి డబ్బులు తిరిగి ఇవ్వడం కానీ, విమానాలు రీ షెడ్యూల్ చేస్తామని వివరించింది.

మే 8న ప్రయాణాలు షెడ్యూల్ చేసుకున్న ప్రయాణికులు తాము ఇంటి నుంచి బయల్దేరే ముందే తమ విమానం క్యాన్సల్ అయిందో లేదోనిర్ధారించుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా, విమానాల రద్దుపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్ విమర్శలు చేసింది. సంస్థ నిర్వహణ బాగోలేదని, సిబ్బంది మధ్య వివక్ష సాధారణమై పోయిందని ఆరోపించింది. విస్తారా ఎయిర్‌లైన్స్ విలీనంపై కూడా సిబ్బంది అసంతృప్తితోఉన్నారు. ప్రయాణికులు తీవ్ర అసంతృప్తితో సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News