Tuesday, March 11, 2025

నూరో విమానాన్ని ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్

- Advertisement -
- Advertisement -

తన విస్తరణలో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సోమవారం నూరో విమానం, బోయింగ్ 737-8ని ప్రవేశపెట్టింది. ఈ విమానం వెనుక భాగం(టెయిల్)పై కర్ణాటక సాంప్రదాయ కుడ్య చిత్ర లేఖనంతో ‘చిత్తారా’ చిత్రం వేసి ఉండడం ప్రత్యేకత. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ విమానానికి జెండా ఊపి మరీ ప్రవేశపెట్టారు. దీంతో ఈ ఎయిర్‌లైన్ వారానికి 445 విమానాలు నడుపుతోంది. ఈ విమానం బెంగళూరు నుంచి హిండన్(ఘాజీయాబాద్, ఢిల్లీ ఎన్‌సిఆర్) రూట్‌లో నడువబోతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News