Sunday, January 19, 2025

ఎయిరిండియా విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైడ్రాలిక్ వైఫల్యంతో విమానం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. అంతకుముందు ఎయిర్‌పోర్టులో పూర్తి స్థాయి అత్యవసర స్థితి ప్రకటించారు. ఎయిర్ ఎండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ విమానం 182 మంది ప్రయాణికులతో శుక్రవారం ఉదయం కాలికట్ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాలోని డమ్మమ్‌కు బయల్దేరింది.

అయితే, టేకాఫ్ సమయంలో విమానం వెనుక భాగం రన్‌వేను ఢీకొని దెబ్బతింది. దీంతో హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు పైలట్లు అనుమానించారు. వెంటనే అప్రమత్తమై విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం తిరువనంతపురం విమానాశ్రయాన్ని సంప్రదించారు. సురక్షితంగా ల్యాండింగ్‌కు వీలుగా గాల్లో ఉండగానే అరేబియా సముద్రంలో ఇంధనాన్ని ఖాళీ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు, ప్రయాణికులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News