Monday, January 20, 2025

ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా కు తాజాగా మరో జరిమానా పడింది. గత ఏడాది పారిస్ ఢిల్లీ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలను రిపోర్టు చేయనందుకు డీజీసీఎ రూ. 10 లక్షల జరిమానా విధించింది. డిసెంబర్ 6 న పారిస్‌ఢిల్లీ విమానంలో ఓ ప్రయాణికురాలు వాష్ రూమ్‌కు వెళ్లినప్పుడు , మరో వ్యక్తి ఆమె సీట్‌పై ఉన్న దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు.

అదే రోజు చోటు చేసుకున్న మరో ఘటనలో మద్యం మత్తులో మరుగుదొడ్ల గదిలో పొగతాగుతూ ఓ వ్యక్తి విమాన సిబ్బందికి పట్టుబడ్డాడు. తాము నివేదిక కోరేంత వరకు ఈ ఘటనలపై ఎయిర్ ఇండియా రిపోర్టు చేయకపోవడాన్ని డీజీసీఎ ఇదివరకే తప్పు పట్టింది. ప్రయాణికుల వికృత చేష్టలకు సంబంధించిన నిబంధనలు పాటించడంలో విమాన సంస్థ ప్రతిస్పందన లోపభూయిష్టంగా ఆలస్యంగా ఉందని పేర్కొంది. ఈమేరకు ఇటీవల షోకాజ్ నోటీస్ జారీ చేసింది. తాజాగా రూ. 10 లక్షల జరిమానా విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News