Monday, January 20, 2025

కాసేపట్లో టేకాఫ్… ఇంతలోనే విమానం నుంచి పొగలు

- Advertisement -
- Advertisement -

Air India flight catches fire in Muscatమస్కట్ : ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం నుంచి పొగలు రావడం కలకలం రేపింది. ఒమన్ రాజధాని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొచ్చికి బయల్దేరేందుకు సిద్ధమవుతున్న బోయింగ్ 737 800 విమానం రన్‌వేపై ఉన్న సమయం లోనే ఇంజిన్ నుంచి పొగలు వ్యాపించడంతో అంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను హుటాహుటిన విమానం నుంచి కించకు దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. భయంతో ప్రయాణికులు పరుగులు తీసిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఈ ఘటన లోనే 14 మందికి గాయాలైనట్టు సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు ఉండగా, వీరిలో నలుగురు శిశువులు ఉన్నారు. అలాగే మరో ఆరుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. ప్రయాణికులందర్నీ ఖాళీ చేయించిన విమానాశ్రయ సిబ్బంది వారిని సురక్షితంగా టెర్మినల్ భవనం లోకి తరలించారు. మరోవైపు మస్కట్ నుంచి కొచ్చికి ప్రయాణికులను తరలించడానికి మరో విమాన సర్వీస్ ఏర్పాటు చేస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ) అధికారులు వెల్లడించారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నారు. మరోవైపు రెండు నెలల క్రితం కూడా కాలికట్ నుంచి దుబాయికి వెళ్లే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కాలిన వాసన రావడంతో ఆ విమానాన్ని మస్కట్‌కు మళ్లించాల్సి వచ్చింది. ఆ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News