Monday, December 23, 2024

మహిళపై మూత్రవిసర్జన కేసు: కోర్టు ముందుకు శంకర్ మిశ్రా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన కేసులో శుక్రవారం రాత్రి బెంగళూరులో అరెస్టు అయిన శంకర్ మిశ్రాను మరి కొద్ది సేపట్లో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఢిల్లీ పోలీసులు హాజరుపరచనున్నారు. ముంబై నివాసి అయిన మిశ్రాను మధ్యాహ్నం 2 గంటల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నట్లు వర్గాలు తెలిపాయి. ఐపిసిలోని 510, 294, 351 సెక్షన్ల కింద మిశ్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

వీటితోపాటు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో విమాన నిబంధనల చట్టంలోని సెక్షన్లు కూడా అతనిపై నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలిపై మద్యం మత్తులో శంకర్ మిశ్రా మూత్ర విసర్జన చేసినట్లు కేసు నమోదైంది. అమెరికాకు చెందిన వెల్స్ ఫర్గో అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీకి ఇండియా విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న శంకర్ మిశ్రాను ఆ హోదా నుంచి తొలగించినట్లు ్ల తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News