Wednesday, January 22, 2025

ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్ డిస్కౌంట్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కస్టమర్ల కోసం ఎయిర్ ఇండియా 96 గంటల ప్రత్యేక చౌక టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించింది. ఈ సేల్ కింద ప్రయాణికులు రూ.1470కి విమాన టిక్కెట్లను పొందవచ్చు. ఎయిర్ ఇండియా దేశీయ, విదేశీ మార్గాల కోసం ప్రత్యేక విక్రయాలను ప్రారంభించింది. ఈ ప్రత్యేక సేల్ 96 గంటలపాటు చెల్లుబాటు అవుతుంది. ఈ సెల్ కింద, ప్రయాణీకులు తక్కువ ధరలకు దేశీయ,అంతర్జాతీయ విమాన టిక్కెట్లను పొందగలరు.

ఎయిర్ ఇండియా ప్రకారం, దేశీయ రూట్ వన్-వే రూట్ టికెట్ కోసం ప్రయాణికులు కేవలం రూ.1470 చెల్లించాలి. ఈ రూ.1470లో అన్నీ కలిపిన ఛార్జీలు చేర్చబడ్డాయి. ప్రయాణీకులు రూ.1470కి ఎకానమీ క్లాస్ టిక్కెట్‌ను పొందుతారు. ఈ ప్రత్యేక 96 గంటల సేల్‌లో ప్రయాణికులు తక్కువ ధరకే బిజినెస్ క్లాస్ టిక్కెట్‌లను పొందవచ్చు. బిజినెస్ క్లాస్ టిక్కెట్ల కోసం ప్రయాణికులు రూ.10,130 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్ ఇండియా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News