Monday, March 10, 2025

ఎలా వెళ్లిందో అలా వెనక్కి వచ్చిన విమానం.. ఏం జరిగిదంటే..

- Advertisement -
- Advertisement -

ముంబై: న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం ముంబై నుంచి ఎలా వెళ్లిందో అలాగే వెనక్కి తిరిగివచ్చింది. విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ఎనిమిది గంటల ప్రమాణం తర్వాత విమానంను మళ్లించారు.

303 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బందితో ఎయిర్‌ఇండియా బోయింగ్ 777 విమానం ఆదివారం అర్థరాత్రి 2 గంటలకు ముంబై నుంచి న్యూయార్క్‌కి బయలుదేరింది. 15 గంటల ప్రయాణం తర్వాత ఆ విమానం న్యూయార్క్ చేరుకోవాల్సింది. కానీ, మధ్యలోనే విమానంలో బాంబు ఉందని బెదిరింపు వచ్చింది. దీంతో అజర్‌బైజాన్ వరకూ వెళ్లిన విమానాన్ని వెనక్కి రప్పించారు.

ముంబైలో ఉదయం 10.20కి ల్యాండ్ అవ్వగానే ప్రయాణికులను దించేసి బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. అయితే ఎలాంటి బాంబు లభించకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్నారు. చివరకు ఆ విమానాన్ని తిరిగి మంగళవారం ఉదయం 5 గంటలకు రీషెడ్యూల్ చేశారు. ప్రయాణికులకు ఎయిర్‌ఇండియా క్షమాపణలు చెప్పి.. వారి భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News